/> Vinayaka vratha pooja vidhanam - శ్రీ వినాయక వ్రతం పూజా విధానం

Vinayaka vratha pooja vidhanam - శ్రీ వినాయక వ్రతం పూజా విధానం

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

ముందుగా
పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

పూజా విధానం మొదలు:- 

ఆచమనమ్ : ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా: మాధవాయ స్వాహా: (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) 
గోవిందాయనమః  
విష్ణవేనమః  
మధుసూదనాయ నమః 
త్రివిక్రమాయ నమః  
వామనాయ నమః  
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః  
పద్మనాభాయ నమః  
దామోదరాయ నమః 
సంకర్షణాయ నమః  
వాసుదేవాయ నమః  
ప్రద్యుమ్నాయ నమః 
అనిరుద్ధాయ నమః  
పురుషోత్తమాయ నమః  
అధోక్షణాయ నమః 
నారసింహాయ నమః  
అచ్యుతాయనమ్మ ఉపేంద్రాయ నమః  
హరయే నమః  
శ్రీకృష్ణాయ నమః

సంకల్పం : ప్రాణాయామం (మూడుసార్లు లోపలికి గాలిపీల్చి నెమ్మదిగా వదలడం) చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. శుభతిధౌ శోభన ముహుర్తె అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరేయ కలియుగే ప్రధమపాదేజంబూద్వీపే భరతవర్నేభరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన...నామ....... సంవత్సరాణాం మధ్యే దక్షిణాయనే వర్షర్త్ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థాం తిథౌ....... వాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టా యాం అస్యాం శుభతిధౌ మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ధి వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.

శ్లో॥ భవసంచిత పపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
శ్లో|| ఏకదంతం శూర్పకర్ణం గజవక్షం చతుర్భుజం పాశాం కుశధరందేవం ధ్యాయేత్సద్ధి వినాయకమ్ 
శ్లో||ఉత్తమం గణనాధస్యవ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ : ధ్యాయేద్గజాననందేవంతప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం|| శ్రీగణాధిపతయే నమః ధ్యాయామి శ్లో|| అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాధనాథసర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి శ్లో|| మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం|| ఆసనం సమర్పయామి శ్లో|| గౌరీపుత్ర నమస్తే స్తు శంకరప్రియ నందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధం పుష్పాక్షతైర్యుతం|| అర్ఘ్యం సమర్పయామి గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విర దానన|| పాద్యం సమర్పయామి శ్లో|| అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచ మనం దేవ తుభ్యం దత్తంమయా ప్రభో ఆచమనీయం సమర్పయామి శ్లో॥ దది క్షీర సమా యుక్తం థామ ద్వా జ్యేన సమన్వితం మధుపర్కం

శ్రీ వినాయ వ్రతము గృహాణేదం గజవక్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. శ్లో|| స్నానం పంచామృతైర్దేవ ' గణనాయిక అనాధనాద సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం స్పయామి. శ్లో గంగాది సర్వతీరేభ్యః ఆహృతైరమలైC : స్నానం కురుష్పభగవాను మా పుత్ర నమోస్తుతే || - శుద్ధాదక స్నానం సమర్పయామి. శ్లో||వస్తచ్యయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం

లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. శ్లో॥ రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానా మిష్టదాయక ఉపవీతం సమర్పయామి. శ్లో|| చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ శీర్థం ప్రతిగృహ్యాతాం! గంధాన్ సమర్పయామి. శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ ఆ ఎయాంసండలాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే|| అక్షతాన్ సమర్పయామి. శ్లో|| సుంగధాని సుపుష్పాణి జాజీ కుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే|| పుష్పాణి పూజయాలు.

ఆధాంగ పూజా : (పుష్పములతో పూజించవలెను) 
గణేశాయనమః పాదౌపూజాయామి ||
ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి ||
శూర్పకర్ణాయ నమః జానూనీ పూజయామి ||
విఘ్నరాజాయామి నమః
జంఘే పూజ" ఆఖువాహనాయ నమః ఊరుం పూజయామి || 
హేరంబాయ నమః కటిం పూజయామి ॥ 
లంబోదరాయనమః ఉదరం పూజయామి‌||
గణనాధాయనమః నాభిం పూజయామి ॥ 
గణేశాయ నమః హృదయం పూజయామి || 
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి ||
గజవక్తాయ నమః వక్రం పూజయామి || 
విఘ్న హంత్రేనమః నేత్రం పూజయామి ||
శూర్పకర్ణాయనమః కలౌ పూజయామి ||
ఫాలచంద్రాయనమః లలాటం పూజయామి ||
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి ||
విఘ్నరాజాయనమః సర్వాణ్యంగాని పూజయామి ||

ఏకవింశతి పత్రపూజ
సుముఖాయనమః   మాచీపత్రం పూజయామి
 గణాధిపాయ నమః   బృహతీపత్రం పూజయామి
ఉమాపుత్రాయ నమః   బిల్వపత్రం పూజయామి
గజాననాయ నమః   దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః   దత్తూరపత్రం - పూజయామి
లంబోదరాయనమః   బదరీపత్రం పూజయామి
గుహాగ్రజాయనమః   అపామార్గ పత్రం పూజయామి
గజకర్ణాయనమః   తులసీపత్రం పూజయామి
ఏకదంతాయ నమః   చూతపత్రం పూజయామి 
వికటాయ నమః    కరవీర పత్రం పూజయామి
భిన్నదంతాయ నమః   విష్ణుక్రాంతపత్రం పూజయామి
వటవేనమః   దాడిమీపత్రం పూజయామి
'సర్వేశ్వరాయనమః  దేవదారు పత్రం పూజయామి
ఫాలచంద్రయ నమః  మరువకపత్రం పూజయామి 
హేరంబాయనమః  సింధువార పత్రం పూజయామి 
శూర్పకర్ణాయనమః   జాజీపత్రం పూజయామి
సూరాగ్రజాయనమః  గండకీపత్రం పూజయామి
ఇభవక్రాయనమః     శమీపత్రం పూజయామి
వినాయకాయ నమః   అశ్వత్థపత్రం జయామి
సురసేవితాయ నమః  అర్జున పత్రం పూజయామి
కపిలాయ నమః   న్కపత్రం పూజయామి
శ్రీ గణేశ్వరాయనమః    ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ:- 
(ప్రతి నామమునకు మొదట - "ఓం" అనియు చినర - "నమ:" అనియు చదువవలెను.)

శ్లో|| దశాంగం గుగ్గలో పేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ|| దూపమాఘ్రాపయామి॥ శ్లో|| పాద్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం నుయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపందర్శుయామి. శ్లో|| సుగంధఆ దీపందర్శుయామి. 

శ్లో|| సుగంధాస్సుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దె: ప్రకల్పితాన్. శ్లో॥ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ. ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక, నైవేద్యం సమర్పయామి. శ్లో॥ సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాంస్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాంబూల సమర్పయామి. శ్లో॥ ఘృతవర్తి సహసైశ్చ శక స్థితం. నీరాజనం' మయాదత్తం గృహాణవరదోభవ నీరాజనం సమర్పయామి.

అథ దూర్వాయుగ్మ పూజా
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి||
ఉమాపుత్రాయ నమః దూ||
ఆఖువాహనాయ నమః దూ|| 
వినాయకాయ నమః దూ|| 
ఈశపుత్రాయ నమః దూ||
సర్వసిద్ధి ప్రదాయకాయ నమః దూ॥ 
ఏకదంతాయ నమః దూ॥ 
ఇభవక్తాయ నమః దూ॥ 
మూషిక వాహనాయ నమః కుమారగురవే నమః దూ॥ ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూ|| 
కుమారగురవే తుభ్యం సమర్పయామి 
సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. 
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, 
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రతం - పాపనాశన, పునర్వ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి పరత్రచ పరాంగతిమ్ "వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

 ఇప్పుడు వినాయకుడి కథ చదివి విని తరించండి.

  శ్రీ వినాయక వ్రత కథ  <<<< CLICK HERE

              ‌‌           సర్వేజనాః స్సుఖినోభవంతు.


Post a Comment

0 Comments

Close Menu