శ్రీ అన్నమాచార్యుని మధుర కీర్తనలు
1
రాగం : మధ్యమావతి తాళం : చ. ఏకతాలం
పల్లవి :
అదిగో ఆల్ల దిగో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము ||అదిగో||
చరణములు :
1. అదే ! వేంకటాచల మఖిలోన్నతము
అదిగో | బ్రహ్మాదుల కపురూపము
అదిగో నిత్యనివాస మఖిల మునులకు
అదే ! చూడు అదె మ్రొక్క ఆనందమయము ||అదిగో||
2. చెంగట నల్ల దిగో ! శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్ల దిగో ! మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయమ ||అదిగో||
3. కై వల్య పదము శ్రీ వేంకట నగమదిగో
శ్రీ వేంకటాపతికి సిరులై నదీ
భావింప సకల సంపద రూప మదిగో
పావనముల కెల్ల పావన మయము ||అదిగో||
0 Comments