శ్రీ అన్నమాచార్యుని మధుర కీర్తనలు
2
రాగం: ధన్యాసి తాళం: చ. రూపక తాళం
పల్లవి : అందితి నిలబొందితి నీ యందఖిల భోగములు
కందర్ప జనక నాకు గరిగితి విన్నిటా ||అందితి||
చరణములు :
1. ఘన కుండలములు నీ కథలు నా చెవులకు
అనువె న రుచులు నీ నామములు నాలుకకు
అనుపై నీకు మ్రొక్కగ నంటీవ నొసలిమన్ను
పనివడి నాకునది పట్టబంధము ||అందితి||
మంచి నిర్మాల్యపుడండ మంగళసూత్రము నాకు
కాంచనపుూసి నీ చక్కని రూపు నా మతికి
పంచామృతములు నీ పాదతీర్థము మేనికి
పంచిన ముద్రలచే వజ్రాంగి జోడు ||అందితి||
సకల బంధులు నీ దాసానుదాసులె నాకు
అకలంక జన్మఫల మన్నిటా నీ కృప నారు
ప్రకటపు శ్రీ వేంకటపతిని నా యతుమలో
మొదలై యుండి నను మోహించ జేసితివి ||అందితి||
0 Comments