శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము : సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పిరి. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు.
ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కల్గిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతుకమైనది. జగత్తుకు శంకరుడు లేనిస్థితియది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది. విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందముతో “ఏమి కావలయునో కోరుకో” మ్మన్నాడు.
విష్ణుదేవుని వ్యూహము ఫలించింది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు, శివుని నందీశ్వరుని వశము జేయుమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు. అయినా మాట తప్పుట కుదరదు. కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది. నా నా శిరస్సు యనంతరం త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశారు. నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరమును; చర్మము తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు.
అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది. తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో , తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అదీ చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయవలె ననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందర బాలుని నాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.
శివుడు తిరిగి వచ్చాడు వాకిట ఉన్న బాలుడు ఆతనికి అభ్యంతర మందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. - తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.
జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ. శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను త్రిలోకపూజనీయతను కలిగించాడు. . గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు' అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వతస్థానమును పొందాడు.
గణపతిని ముందు పూజించాలి : గణేశుడు అగ్రపూజనీయుడు. ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి ? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది. శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. “మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు.
కుమారస్వామి వేగముగా, సులువుగా సాగి వెళ్ళాడు. గజాసనుడు మిగిలిపోయినాడు. త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయ మర్ధించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారము లు , అనగా జలములు. జలమున్నియు నారాయుణుని అధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కావొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించింది.
చంద్రునిపరిహాసం : గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు. • (చంద్రుడు మనస్సుకు. సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడను సరణీయుడైనాడు. ఆతని మాన్యత నశించింది. నింద్యుడయినాడు. ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి. అనగా తనిని చూడరాదు. చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయనట్లే. లోకులు కూడా అజ్ఞానులు. నింద్యులు అవుతారు. నిందలకు గురియగుతారు.
చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడ శాపమైనది. 'లోకులు చంద్రుని చూడకుండ టెట్లు ? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు ? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై దేవుదేవుని అర్థించినారు. కరుణామయడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
చంద్రదర్శనం - నీలాపనింద : ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు.
సత్రాజిత్తును నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకునీ వద్ద ఉండదగినదని ధర్మజుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. ఆతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది అతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి ' అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది.
నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.ఆ నింద బాపుకొనుటకు శ్రీకృష్ణునికి కర్తవ్యమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అంతట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలికకున్న ఊయల తొట్టికి మళ్ళీ వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది. ఒక దినముకాదు రెండు దినములు కాదు. ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.
శ్యమంతకమణి - బాలామణి : అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు, శక్తిమంతుడునైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు, ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుచున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు.
అది " త్రేతాయుగపు - గాథ. ఇది ద్వాపరయుగము. యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామ చంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా | శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును "కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు
కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు - కర్మ సరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిధిలమయింది: జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తన్నును గ్రహించిన ఆ శ్రీరామచంద్రునకు ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణితోపాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
శ్రీ కృష్ణుడు మణిని తీసుకుని, నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీ కృష్ణునికిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక, చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల సరమదయాళువై భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ మంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను, నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సంప్రదాయమయినది. పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు ... సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోద: తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా! ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్ధము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. (ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాటయని చెప్పబడినది.)
సర్వేజనాః స్సుఖినోభవంతు.
0 Comments